జియో దెబ్బ.. 4జీ సెగ్మెంట్లోకి టెలినార్.. రూ.57లకే 28 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ 4జీ డేటా ఆఫర్

రిలయన్స్ జియో దెబ్బతో టెలికామ్ సంస్థలన్నీ ఆఫర్లు ప్రకటించేందుకు సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, ఐడియా, బీఎస్‌ఎన్ఎల్ వంటి కంపెనీలు ఇచ్చిన అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్‌నే తాజాగా టెలినార్ ప్రకటించింద

Selvi| Last Updated: ఆదివారం, 15 జనవరి 2017 (15:49 IST)
రిలయన్స్ జియో దెబ్బతో టెలికామ్ సంస్థలన్నీ ఆఫర్లు ప్రకటించేందుకు సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, ఐడియా, బీఎస్‌ఎన్ఎల్ వంటి కంపెనీలు ఇచ్చిన అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్‌నే తాజాగా టెలినార్ ప్రకటించింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెలినార్ కంపెనీ 4జీ సెగ్మెంట్‌లోకి కూడా అడుగు పెట్టింది. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో. అంతేకాదు మరికొన్ని ఆకర్షణీయమైన డాటా ప్యాక్‌లతో కస్టమర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది.

ఇప్పుడు టెలినార్ రూ. 11తో రిచార్జ్ చేసుకుంటే ఒక రోజంతా అన్‌లిమిటెడ్ 4జీ డేటాను వాడుకోవచ్చు. అది కూడా ఇష్టమైనంత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు రూ. 239తో రిచార్జ్ చేస్తే 6జీబీ 4జీ డేటా వస్తుంది. దీనితో పాటు కొంత మంది సెలెక్టెడ్ యూజర్లకు రూ.57లకే 28 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ 4జీ డేటా ఆఫర్ అందిస్తుంది. అదే రూ. 98తో రీచార్జ్ చేస్తే 2జీబీ డేటా లభిస్తుందని.. ఇది కూడా 28 రోజులకు వర్తిస్తుంది.దీనిపై మరింత చదవండి :