శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (11:25 IST)

ఎయిర్‌టెల్ ఫ్రీ వాయిస్ కాల్ ఆఫర్.. రూ.2249 చెల్లించాలట... ఇదేం ఆఫరోనంటూ పెదవి విరుపు

రిలయన్స్ జియో దెబ్బకు అన్ని టెలికాం ప్రైవేట్ కంపెనీలు కిందికి దిగివస్తున్నాయి. నిన్నమొన్నటివరకు ఇష్టానుసారంగా కాల్ చార్జీలు వసూలు చేసిన కంపెనీలు ఇపుడు ధరలను తగ్గించే విషయం పోటీ పడుతున్నాయి. ఇందులోభాగం

రిలయన్స్ జియో దెబ్బకు అన్ని టెలికాం ప్రైవేట్ కంపెనీలు కిందికి దిగివస్తున్నాయి. నిన్నమొన్నటివరకు ఇష్టానుసారంగా కాల్ చార్జీలు వసూలు చేసిన కంపెనీలు ఇపుడు ధరలను తగ్గించే విషయం పోటీ పడుతున్నాయి. ఇందులోభాగంగా, వోడాఫోన్ కంపెనీ ఇప్పటికే ఉచిత రోమింగ్‌ను కల్పించింది. 
 
అలాగే, టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కూడా ఫ్రీ వాయిస్ కాల్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 2249 చెల్లిస్తే 18 జీబీ 4జీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ పూర్తి ఉచితంగా చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే వ్యాలిడిటీ మాత్రం 28 రోజులేనని నిబంధన పెట్టింది. 
 
ఈ ఆఫర్ కూడా కంపెనీ నుంచి ఎస్‌ఎంఎస్ పంపిన వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ ఆఫర్‌పై యూజర్లు పెదవి విరుస్తున్నారు. అపరిమిత వాయిస్ కాల్స్ ఇచ్చినట్టే ఇచ్చి, 28 రోజులకు 2249 రూపాయలు వసూలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.