జియో దెబ్బతో వొడాఫోన్ సూపర్ ఆఫర్.. రూ.16కే గంట పాటు 3జీ 4జీ డేటా

జియో దెబ్బతో ప్రముఖ టెలికామ్ మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్ కొన్ని ఆసక్తికరమైన పథకాలను అందుబాటులోకి తేనుంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మొదలుపెట్టిన ఉచిత ఆఫర్ల ధాటికి తట్టుకునే దిశగా వొడాఫోన్ కూడా తన ఫ్లాన్‌ల

vodafone logo
Selvi| Last Updated: శనివారం, 7 జనవరి 2017 (12:15 IST)
జియో దెబ్బతో ప్రముఖ టెలికామ్ మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్ కొన్ని ఆసక్తికరమైన పథకాలను అందుబాటులోకి తేనుంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మొదలుపెట్టిన ఉచిత ఆఫర్ల ధాటికి తట్టుకునే దిశగా వొడాఫోన్ కూడా తన ఫ్లాన్‌లో కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే వొడాఫోన్ రెడ్‌లో మార్పులు చేసిన ఈ కంపెనీ శుక్రవారం మరికొన్ని కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. ప్రీ పెయిడ్ వినియోగదారులకు 'సూపర్ అవర్' పథకాన్ని ప్రకటించింది.

ఇప్పటికే వొడాఫోన్ కూడా తన ప్లానుల్లో కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా రూ.16కే ఒక గంట పాటు 3జీ లేదా 4జీ డేటా అందించే ప్లాన్‌ను ప్రకటించింది. మరో పథకంలో రూ.7కే అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్ (వొడాఫోన్ టు వొడాఫోన్) ఒక గంటసేపు చెల్లుబాటు అయ్యేలా రూపొందించింది.దీనిపై మరింత చదవండి :