శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By JSK
Last Modified: మంగళవారం, 1 నవంబరు 2016 (12:56 IST)

ఛార్జ‌ర్... యూఎస్‌బి కేబుల్ ఒక‌టేనా...? అందుకే సెల్ ఫోన్ పేలిపోతుంది...

ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్లు పేలిపోవడం ప‌రిపాటిగా మారింది. దీనితో కొన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్లు కొంటున్న ప్రతి ఒక్కరికీ ఫైర్‌ఫ్రూఫ్ టూల్స్‌ను అందించనున్నాయట. ఛార్జింగ్ పెట్టే సమయంలో కరెంట్ షాక్ కొట్టకుండా ముందు జాగ్రత్తగా ఈ విధాన్నాన్ని అమలు చేయబో

ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్లు పేలిపోవడం ప‌రిపాటిగా మారింది. దీనితో కొన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్లు కొంటున్న ప్రతి ఒక్కరికీ ఫైర్‌ఫ్రూఫ్ టూల్స్‌ను అందించనున్నాయట. ఛార్జింగ్ పెట్టే సమయంలో కరెంట్ షాక్ కొట్టకుండా ముందు జాగ్రత్తగా ఈ విధాన్నాన్ని అమలు చేయబోతున్నారట. స్మార్ట్‌ఫోన్లు పేలిపోయి... మంట‌లు వ‌చ్చిన సంఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య చాలానే జ‌రిగాయి. 
 
అయితే, గూగుల్‌కు చెందిన ఇంజనీర్ ‘బెన్‌సన్ లీయుంగ్’ సెల్‌ఫోన్లు పేలడానికి గల కారణాన్ని వివరించాడు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న చార్జర్లలను రెండు రకాలు ఉపయోగాలను దృష్టిలో పెట్టుకుని తయారుచేస్తున్నారట. ఒకటి త్వరగా చార్జింగ్ ఎక్కడానికి కాగా, మరొకటి అదే కేబుల్‌ను యుఎస్‌బీ-కనెక్టర్ కేబులుగా ఉపయోగిస్తున్నారు. 
 
ఒకే టూల్ ఇలా రెండు విధాలుగా ఉపయోగించడం అసాధ్యమని, అందుకే సెల్‌ఫోన్లు పేలుతున్నాయని ఆయన వివరించారు. ఇక నుంచైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మేల్కొని జాగ్రత్తలు తీసుకుంటే వినియోగదారులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.