షియోమీ 200 మెగాపిక్సెల్ కెమెరా.. ఇంటర్నెట్‌లో లీక్
షియోమీ 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న కొత్త స్మార్ట్ ఫోన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 108 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్‌తో ఎంఐ 11ఎక్స్ ప్రోను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. శాంసంగ్ కూడా 200 మెగాపిక్సెల్ ఐసోసెల్ సెన్సార్‌ను రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చైనాకు చెందిన ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (వీబో ఐడీ) ఈ మేరకు వీబోలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని ట్వీట్ కూడా చేశారు. ఈ టిప్ స్టర్ పోస్ట్ ప్రకారం.. షియోమీ 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్‌ను రూపొందిస్తుంది. కానీ ఆ స్మార్ట్ ఫోన్ పేరు మాత్రం తెలియరాలేదు.
ఐస్ యూనివర్స్ అనే ఐడీ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను శాంసంగ్ రూపొందిస్తుందని ట్వీట్ చేశారు. ఇది 0.64 మైక్రాన్ పిక్సెల్‌ను కలిగి ఉండనుందని తెలుస్తోంది.
శాంసంగ్ 200 మెగాపిక్సెల్‌ను రూపొందిస్తుందని వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. గతంలో కూడా కొందరు టిప్ స్టర్లు శాంసంగ్ 200 మెగాపిక్సెల్ కెమెరా గురించి ట్వీట్లు వేశారు.
ఈ 200 మెగాపిక్సెల్ సెన్సార్ సైజు 1/1.37 అంగుళాల సైజు ఉండనుంది. 1.28 మైక్రాన్ పిక్సెల్స్ ఇందులో అందించనున్నారు. ఇందులో 4-ఇన్-1, 16-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ ఉండనుంది. ఈ సెన్సార్ 16కే వీడియోలను కూడా రికార్డు చేయనుందని తెలుస్తోంది.
వైల్యాబ్ ఈ సెన్సార్ గురించి తెలిపినప్పుడు జెడ్‌టీఈ యాక్సాన్ 30 ప్రో 5జీలో ఈ సెన్సార్‌ను అందిస్తారని తెలిపింది. అయితే ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ కెమెరాతో లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22లో 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ 200 మెగాపిక్సెల్ సెన్సార్‌కు సంబంధించిన 3డీ ప్రొడక్ట్ రెండర్స్ కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. అయితే ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినా ఈ కెమెరా మార్కెట్లో సంచలనం సృష్టించడం మాత్రం ఖాయం. అయితే ఈ సెన్సార్‌తో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ మీద మాత్రం విపరీతమైన ఆసక్తి నెలకొంది.