Redmi Note 14 5G సిరీస్, స్మార్ట్ ఆడియో ఉత్పత్తులను ఆవిష్కరించిన షియోమి
రెడ్ మి నోట్ 14 ప్రో సిరీస్ 5G: ఇది ఏఐ ఆధారిత పనితీరుని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని ఫ్లాగ్‌షిప్ కెమెరా, చూడగానే ఆకట్టుకునే అద్భుతమైన డిజైన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, IP68తో సాటిలేని మన్నికను కలిగి ఉంది. అన్నింటికి మించి అన్ని సెగ్మెంట్ లలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో కూడిన స్మార్ట్ ఫోన్ కావడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
రెడ్ మి నోట్ 14 5G: ఇది లేటెస్ట్ డిజైన్, శక్తివంతమైన కెమెరా సెటప్, 120Hz అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. రెడ్ మి నోట్ 14 పనితీరులోనూ, చూడ్డానికి అద్భుతంగా కన్పించే విషయంలోనూ అన్ని ఫోన్ల కంటే అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
స్మార్ట్ స్పీకర్, రెడ్‌మి బడ్స్ 6: స్పష్టమైన సౌండ్, ఎక్కవ సేపు వచ్చే బ్యాటరీ లైఫ్‌తో పాటు కస్టమైజ్ చేసిన ఆడియోను అందిస్తూ... స్మార్ట్ ఫోన్ x AIoT ఎకో సిస్టమ్‌ను మరింతగా మెరుగు పరుస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వచ్చే బ్రాండ్ షియోమి. గత కొన్నేళ్లుగా అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్‌తో వినియోగదారుల ఆదరణ చూరగొన్న షియోమి బ్రాండ్.. తాజాగా రెడ్ మి నోట్ 14 5G సిరీస్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్‌లో అత్యుత్తమమైన ఫోన్. ఈ సిరీస్‌లో అద్బుతమైన ఫ్లాగ్ షిప్ కెమెరా, అతిపెద్ద బ్యాటరీ, అసాధారణైన మన్నికను అందిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ ఏఐతో కనెక్ట్ చేయబడుతుంది. తద్వారా అత్యాధునిక అత్యుత్తమ పనితీరుని కనబరుస్తుంది. అంతేకాకుండా వినూత్న రూపకల్పనతో మొబైల్ అనుభవాలను సరికొత్త శిఖరాలకు ఎలివేట్ చేయడానికి అధునాతన కెమెరా వ్యవస్థను కూడా అందిస్తుంది.
రెడ్ మి నోట్ 14 సిరీస్‌తో పాటు, షియోమి తన ఆడియో ఉత్పత్తులను మరింతగా విస్తరించింది. అందులో భాగంగా షియోమి సౌండ్ అవుట్‌డోర్ స్పీకర్, రెడ్ మమి బడ్స్ 6ని కూడా పరిచయం చేస్తోంది. ఈ కొత్త ఉత్పత్తులు ఎలాంటి ఇబ్బందులు లేని కనెక్టివిటీని అందిస్తాయి. తద్వారా స్మార్ట్ ఫోన్‌లు మరియు ఆడియో ఉత్పత్తులలో వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు సదా సిద్ధంగా ఉంది షియోమి. స్మార్ట్ ఫోన్ x AIoT ద్వారా, షియోమి స్మార్ట్ వినూత్నమైన మరియు యాక్సెస్ కలిగిన సాంకేతికతను అందించడాన్ని కొనసాగిస్తుంది.