Biodata Maker

బిస్కెట్లు, క్రీమ్ బిస్కెట్లు పిల్లలకు ఇస్తున్నారా? (video)

Written By సెల్వి
Updated: గురువారం, 4 మార్చి 2021 (16:38 IST)
Biscuits
సాధారణ బిస్కెట్ల కంటే క్రీమ్ బిస్కెట్లు పిల్లలకు ఇవ్వడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రీమ్ బిస్కెట్లలో చేర్చే ఫ్లేవర్లు, కలర్స్‌లలో రసాయనాలు ఎక్కువగా వుంటాయి. ఇంకా ఉప్పు చేర్చే బిస్కెట్లలో సోడియం కార్బనేట్ వంటివి రక్తపోటును పెంచుతాయి. అధిక సోడియం కలిపిన బిస్కెట్లను పిల్లలు తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. 
 
అలాగే బిస్కెట్లు మైదాపిండి తయారవుతున్న కారణంగా పిల్లల్లో మలబద్ధకాన్ని ఏర్పరుస్తాయి. అలాగే ఒక గ్లాసుడు పాలలో రెండు బిస్కెట్లు పిల్లలకు ఇవ్వడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తద్వారా పిల్లల్లో చురుకుదనం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. బిస్కెట్లలోని సుక్రోస్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తుంది. తద్వారా డయాబెటిస్ తప్పదు. 
 
అయితే షుగర్ ఫ్రీ బిస్కెట్లలోనూ సుక్రోస్ లేకపోయినా.. దానికి బదులు షుగర్ ఫ్రీ మాత్రలు, కార్న్ ఫ్లోర్, షుగర్ సిరప్ చేర్చుతారు. ఇవి శరీర మెటబాలిజం స్థాయిలను తగ్గించేస్తాయి. తద్వారా కాలేయ సమస్యలు ఏర్పడే అవకాశం వుంది. 
 
అందుచేత పిల్లలకు, పెద్దలకు ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని ఇవ్వడం చేయాలి. తృణధాన్యాలతో చేసిన ఫలహారాలు, నట్స్‌తో చేసిన స్నాక్స్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

 

అన్నీ చూడండి

చెంబూరులో అలాంటి స్థితిలో 20 పిల్లులు మృతి.. సమాచారం ఇస్తే రూ.50వేలు కానుక

ఇంద్రాయణీ నదీ తీరం వద్ద పిచ్చకొట్టుడు కొట్టుకున్న హిజ్రాలు, వీడియో

స్కూల్ లీవ్ ఇస్తారని తోటి విద్యార్థిని చంపబోయిన స్టూడెంట్స్...ఎక్కడ?

తోతాపురి మామిడి రైతులకు ఏపీ సర్కారు శుభవార్త.. అదేంటంటే?

TGSRTC, ఆటోను తప్పించబోయి పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన బస్సు, వీడియో

అన్నీ చూడండి

బిగ్ బాస్ తెలుగులో బిగ్ ట్విస్ట్, ఏంటది?

ఈ వారం డిజాస్టర్ గా నిలిచిన సర్దార్ 2, మందాడి, మారెమ్మ చిత్రాలు

Deepika Padukone :దువా రెండవ పుట్టినరోజున గర్బిణీ ఫొటోలను పంచుకున్న దీపికా పడుకోన్

సినిమాలను వదులుకుంటానన్న సమంత.. వద్దని మా ఇంటి బంగారం చేసిన రాజ్

ది ప్యారడైజ్ షూటింగ్ పూర్తి- శరవేగంగా పోస్ట్-ప్రొడక్షన్ పనులు - సెప్టెంబర్ 24న రిలీజ్

తర్వాతి కథనం
Show comments