సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (17:42 IST)

బ్రెజిల్‌లో కరోనా విజృంభణ.. 424 గంటల్లో 21,641 మంది మృతి

corona virus
బ్రెజిల్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అక్కడ తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాలు గతేడాది మార్చి నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1,641 మంది మృతి చెందటమే అందుకు నిదర్శనం. దీంతో దేశంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రమైనట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇటీవల జరిగిన పలు వేడుకలే ఇందుకు కారణంగా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
దేశంలోని 20 రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో 80శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు దేశంలో కర్ఫ్యూ విధించాలని జాతీయ ఆరోగ్య కార్యదర్శులు పిలుపునిచ్చారు. బ్రెజిల్‌లో కొవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2.57లక్షల మంది మరణించారు. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న దేశం బ్రెజిలే కావడం గమనార్హం. మరోవైపు బ్రెజిల్‌ జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ ఏడాది చివరికల్లా అందరికీ టీకా అందించాలని ప్రభుత్వం యత్నిస్తోంది.