వేసవిలో లేతకొబ్బరి నీటిని తాగితే... (video)

coconut water
సిహెచ్| Last Updated: సోమవారం, 1 మార్చి 2021 (14:35 IST)
వేసవి కాలములో శరీరాన్ని చల్లబరిచి తాపాన్ని తగ్గించే కొబ్బరిబొండాం నీళ్లలో పలు ఔషధ విలువలున్నాయి. వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, అమ్మవారు జబ్బు పొక్కులు తగ్గేందుకు కొబ్బరి నీటిని లేపనంగా వాడుతుంటారు. కొన్ని రకాల సమస్యలు కొబ్బరి నీటితో తగ్గిపోతాయి.

మూత్రసంబంధమైన జబ్బులలోను, కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందుగా పనిచేస్తుంది. లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగాను, చక్కెర పరమితంగాను ఉంటుంది. కొబ్బరి బొండాం నీటిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది. శరీరం డీహైడ్రేషనుకి లోనుకాకుండా చూస్తుంది.

జీర్ణకోశ బాధలతో చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి మందుగా పనిచేస్తుంది. విరోచనాలు అయినపుడు ఓరల్ రి-హైడ్రేషన్‌గా ఉపయోగపడుతుంది.దీనిపై మరింత చదవండి :