సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (18:02 IST)

National Cabbage Day, క్యాబేజీ కేన్సర్‌ను ఎదుర్కొంటుంది

క్యాబేజీలో కేలరీలు చాలా తక్కువగా ఉన్నాయి, ఇది అద్భుతమైన పోషకాల గని అని చెప్పవచ్చు. కేవలం 1 కప్పు (89 గ్రాములు) ముడి ఆకుపచ్చ క్యాబేజీలో ఈ క్రింది మోతాదులో పోషకాలు వుంటాయి.
 
కేలరీలు: 22, ప్రోటీన్: 1 గ్రాము, ఫైబర్: 2 గ్రాములతో పాటు విటమిన్ కె, విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్, విటమిన్ బి 6, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వున్నాయి. క్యాబేజీలో విటమిన్ ఎ, ఐరన్, రిబోఫ్లేవిన్ వంటి ఇతర సూక్ష్మపోషకాలు కూడా ఉన్నాయి.
 
ముఖ్యంగా విటమిన్ బి 6 మరియు ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ శరీరంలోని అనేక ముఖ్యమైన ప్రక్రియలకు అవసరం, వీటిలో శక్తి జీవక్రియ మరియు నాడీ వ్యవస్థ యొక్క సాధారణ పనితీరును మెరుగుపరుస్తాయి. క్యాబేజీలో ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్లు మరియు దృష్టి లోప సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.
 
క్యాబేజీలో క్యాన్సర్ నిరోధక పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని తింటే క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇది పూర్తిగా ఆపుతుంది. క్యాబేజీని తినడం క్యాన్సర్‌ను నివారించవచ్చని తేలింది. అల్సర్‌తో బాధపడేవారు క్యాబేజీ రసం తీసుకుంటే గాయం త్వరగా నయమవుతుంది. ఎందుకంటే ఇందులో గ్లూటామైన్ అధికంగా ఉంటుంది, ఇది అల్సర్లను నయం చేస్తుంది.