క్యాబేజీని ఎక్కువ సేపు ఉడికించకూడదట.. అలాచేస్తే?
క్యాబేజీలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. ఇందులో విటమిన్ ఎ, సి, కెలు వున్నాయి. ఇవి క్యాన్సర్, హృద్రోగ వ్యాధులను దూరం చేస్తాయి. క్యాబేజీలోని పీచు అజీర్తిని దూరం చేస్తుంది. అయితే క్యాబేజీని ఎక్కువ సేపు ఉడికించకూడదు. అలా ఉడికిస్తే వాటిలోని పోషకాలు తొలగిపోతాయి. క్యాబేజీని అధికంగా వుడికించకుండా పది నిమిషాల పాటు ఉడికిస్తే చాలు.
ఇకపోతే.. క్యాన్సర్ కారకాలను తొలగించే ఈ క్యాబేజీని వారానికి రెండు సార్లైనా ఆహారంలో భాగం చేసుకోవాలి. అల్సర్‌తో బాధపడేవారు.. క్యాబేజీ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని, వ్యవస్థను బలపడేలా చేస్తుంది. క్యాబేజీలోని బీటా-కెరోటిన్ కంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
అలాగే క్యాబేజీ బరువును తగ్గిస్తుంది. రోజూ ఒక కప్పు ఉడికించిన క్యాబేజీని తీసుకుంటే లేదా సూప్‌ను తీసుకుంటే బరువు ఇట్టే తగ్గిపోతారు. మహిళలు 30 దాటితేనే క్యాల్షియం, ఫాస్పరస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే మహిళలు రోజూ ఆహారంలో క్యాబేజీని భాగం చేసుకుంటే మంచిది. క్యాబేజీ నరాలకు శక్తినిస్తాయి. అలెర్జీలను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.