బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (16:46 IST)

తేగలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? (video)

శీతాకాలం ముగుస్తూ వేసవి ప్రారంభమవుతుందనగా తేగలు వచ్చేస్తాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువ. సీజనల్ ఫుడ్ అయినటువంటి ఈ తేగలను తీసుకుంటే ఒనగూరే ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. తేగలు బ్లడ్ క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటాయట. క్యాన్సర్‌ను తొలి దశలోనే నిర్మూలించే శక్తి వీటికున్నాయి, దీనికి కారణం ఇందులోని పీచు పదార్థమే. ఈ పీచు పదార్థం జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పతుతుంది. పెద్దపేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులోని క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి. ఫాస్పరస్ శరీరానికి దృఢత్వాన్నిస్తాయి.
 
మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలోని తెల్ల రక్తకణాలను వృద్ధిచేస్తుంది. ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు వుండటంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. శరీరానికి చలవనివ్వడమే కాకుండా నోటిపూతను తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చెమటకాయలను తేగలు నివారిస్తాయి. 
 
ఐతే తేగలను అధికంగా తీసుకోకూడదు. రోజుకు రెండు తీసుకోవచ్చు, వారానికి ఐదారు తీసుకోవచ్చునని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అంతేగానీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధిక మోతాదులో తీసుకుంటే.. కడుపునొప్పి ఏర్పడే అవకాశం వుందని హెచ్చరిస్తున్నారు. తేగలను తీసుకోవడం వల్ల క్యాల్షియం, ఫాస్పరస్, ధాతువులు, ఒమేగా-3, పొటాషియం, విటమిన్ బి, బి1, బి3, సి శరీరానికి అందుతాయి.