గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 4 జనవరి 2021 (21:43 IST)

ఉసిరికాయలపై బెల్లం పొడి చల్లి అలా చేసి తీసుకుంటే?

బెల్లాన్ని ఆహార పదార్థాల్లో తీపి చేసుకునేందుకు ఉపయోగిస్తుంటాం. కానీ ఇందులో ఔషధ గుణాలున్నాయి. బెల్లాన్ని ఎలా ఉపయోగిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చో చూద్దాం.
 
మోకాళ్లు, నడుము నొప్పులు తగ్గేందుకు బెల్లం, సున్నం కలిపి కొద్దిగా నీరు చేర్చి కానీ లేదంటే బెల్లం, చింతపండు గుజ్జు కానీ కలిపి మెత్తగా నూరి లేపనం చేస్తూ వుండాలి. ఇలా చేస్తే బెణుకు నొప్పులు, కండరాల నొప్పులు కూడా త్వరగా తగ్గిపోతాయి.
 
కీళ్ల నొప్పులున్నవారు రోజూ ఒకట్రెండు సార్లు పూటకి 200 మిల్లీ లీటర్ల పాలలో 5 గ్రాముల బెల్లం, 5 మిల్లీ లీటర్ల నెయ్యి, ఒకటిరెండు గ్రాముల శొంఠిపొడి కలిపి సేవిస్తుంటే సమస్య తగ్గుతుంది.
 
అలాగే వ్యాధినిరోధక శక్తి పెరిగేందుకు అరకిలో బెల్లం, అరకిలో ఉసిరికాయలను తీసుకుని వెడల్పాటి గాజు సీసాలో ఒక వరుస ఉసిరికాయలు పేర్చి దానిపై బెల్లం పొడి చల్లాలి. ఆ తర్వాత మరోసారి ఉసిరికాయలు, బెల్లం పొడి ఇలా మూడు, నాలుగు వరసలు పేర్చి మూత పెట్టి నాలుగైదు రోజులు అలాగే వుంచితే ఉసిరికాయలు మెత్తబడతాయి. ఆ తర్వాత రోజు పరగడపున ఒక ఉసిరికాయ చొప్పున సేవిస్తూ వుంటే వ్యాధినిరోధక శక్తి పెరిగి వ్యాధులు వేధించకుండా వుంటాయి.