మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (22:31 IST)

చెరుకు రసం తాగితే కలిగే ప్రయోజనం ఏమిటి?

వేసవి వస్తుందనగా చెరకు రసం షాపులు కూడా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం కరోనా కూడా తగ్గుముఖం పట్టడంతో మెల్లగా పండ్ల రసాలు, చెరుకు రసం తాగుతున్నారు. ఈ చెరుకు రసంతో ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. తక్షణ శక్తిని ఇస్తుంది. కామెర్లు నివారణకు సాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ సంరక్షణకు మేలు చేస్తుంది. గాయాలను నయం చేస్తుంది.
 
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని కొంత మంది భావిస్తారు. కానీ ఇటువంటప్పుడు ఒక గ్లాస్ చెరకు రసం తాగడం వల్ల ఈ జబ్బుల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. వేసవిలో ప్రతిరోజు ఒక గ్లాసు చెరకురసం త్రాగటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. 
 
క్రోమియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. వాటితోపాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లు ఎక్కువగా ఉన్న ఈ చెరకు రసం బాలింతలు తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. చెరకులో కాల్షియం ఉండటంతో ఎముకలు దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్నపిల్లల ఎదుగుదలకు చెరకురసం చక్కగా దోహదపడుతుంది. 
 
బరువు తగ్గాలనుకునే వారికి చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ రెండు పూటలా ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి త్రాగండి. వ్యాధి నిరోధక శక్తిని పెంచి, తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది. మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి చెరకురసం మంచి ఔషధం.