రాజకీయాల్లోకి రంగీలా హీరోయిన్... ఉత్తర ముంబై నుంచి బరిలోకి

urmila
Last Updated: మంగళవారం, 26 మార్చి 2019 (14:42 IST)
వివాదాస్పద దర్శకుడు అనేక బాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. అలా నిర్మించిన చిత్రాల్లో "రంగీలా" ఒకటి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈ చిత్రం వచ్చింది. ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ ఒక్క చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టనుంది.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈమె ముంబై ఉత్తరం పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నియోజక వర్గం నుంచి గతంలో సునీల్ దత్ ఐదు సార్లు పార్లమెంట్‌కు ఎంపికయ్యారు. సినీ గ్లామర్‌ను అక్కున చేర్చుకోవడంలో ఈ పార్లమెంట్ నియోజక వర్గం ముందుండటంతో ఊర్మిళ పోటీ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.
దీనిపై మరింత చదవండి :