సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (10:37 IST)

లోక్‌సభ తొలి దశ పోలింగ్ కోసం గూగుల్ డూడుల్ : చూపుడు వేలికి ఇంక్ చుక్క ఉన్న చెయ్యి బొమ్మ!!

google dude
దేశంలో తొలిదశ పోలింగ్ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. దీనికి గుర్తుగా గూగుల్ డూడుల్‌ను క్రియేట్ చేసింది. గూగుల్ హోం పేజీపై గూగుల్ అక్షరాలు తొలగించింది. చూపుడు వేలికి ఇంక్ చుక్క ఉన్న చెయ్యి బొమ్మను ఏర్పాటు చేసింది. దానిపై క్లిక్ చేస్తే ఎన్నికల సమాచారంతో కూడిన వివరాలు ఓపెన్ అవుతున్నాయి. అయితే, ఈ డూడుల్ డిజైన్ చేసి వ్యక్తి పేరును మాత్రం గూగుల్ వెల్లడించలేదు. 
 
కాగా, ఏడు దశల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. తొలి దశలో మొత్తం 16.36 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. 543 స్థానాలకు గాను 7 దశల్లో పోలింగ్ నిర్వహించేలా భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. రెండో దశ పోలింగ్ ఈ నెల 26వ తేదీన, మూడో దశ పోలింగ్ మే 7వ తేదీన నాలుగో దశ పోలింగ్ మే 13న, ఐదో దశ పోలింగ్ మే 20న, ఆరో దశ పోలింగ్ మే 25న, ఏడో దశ పోలింగ్ జూన్ ఒకటో తేదీన జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన చేపట్టి, అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు. 
 
యువకులారా.. పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేయండి : ఆరు భాషల్లో ప్రధాని మోడీ ట్వీట్ 
 
దేశ వ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని యువతకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆయన ఏకంగా ఆరు భాషల్లో తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ ట్వీట్ చేశారు. రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. యువతి, తొలిసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సందేశమిచ్చారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నిక మొదటి దశ పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ దశలో మొత్తం 102 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అలాగే, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ కొనసాగుతుంది. 
 
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓటర్లకు కీలక సందేశమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యువత, తొలిసారి ఓటు హక్కును వినియోగించేవారు భారీ సంఖ్యలో పాల్గొని ఓటు వేయాలని కోరారు. ఈ మేకు తొలి దశ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు ఇంగ్లీష్, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు, ప్రతి గొంమతు ముఖ్యమైనదేనని వ్యాఖ్యానించారు.
 
2024 లోక్‌సభ ఎన్నికలు ఈ రోజు ప్రారంభమవనున్నాయి. ఎన్నికలు జరుగుతున్న 21 రాష్ట్రాలు, కేందర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాల్లో ఓటు హక్కు ఉన్నవారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటు వేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా, యువత తొలిసారి ఓటర్లు ఓటు వేయాలని నేను పిలుపునిస్తున్నాను. ఎంతైనా ప్రతి ఓటు విలువైనదే. ప్రతి గొంతు ముఖ్యమైనదే అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.