Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

శివరాత్రి ఉపవాసంతో ముక్తి.... ఆరోగ్యం కూడా...

శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెపుతుంది. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధ సేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం ఉ

Written By chj
Updated: మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (19:34 IST)
శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెపుతుంది. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధ సేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. 
 
ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడం అని. 
 
భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.

అన్నీ చూడండి

Keralam: తొమ్మిదేళ్ల బాలిక కడుపులో కేజీ వెంట్రుకలు.. శస్త్రచికిత్సతో తొలగింపు

తెలంగాణలో రాత్రి వరకు ఉరుములతో కూడిన వర్షాలు

Sri City Boiler Blast: శ్రీసిటీలో పేలుడు.. ఐదుగురు మృతి.. పదిమందికి గాయాలు (vide)

ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై నిషేధం.. ఈ దాడికి, టెహ్రాన్‌కు సంబంధం ఉన్నట్లు తెలిస్తే.. ట్రంప్ వార్నింగ్

Amaravati: అమరావతిని అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దుతాం.. నారాయణ

అన్నీ చూడండి

03-10-2026 శనివారం మీ రాశి ఫలాలు - కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి

Madhya Ashtami: అక్టోబర్ మూడో తేదీన మధ్య అష్టమి.. పితృవులు, దుర్గాదేవిని ఇలా పూజిస్తే?

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 30 గంటలు

02-10-2026 రోజు రాశి ఫలాలు - కొత్త పరిచయం అలా ఉపయోగపడుతుంది...

శుక్రవారంతో ఆరుద్ర నక్షత్రం.. ఏ పూజ చేయాలి.. ఎలాంటి దానం ఇవ్వాలంటే?

తర్వాతి కథనం
Show comments