శనివారం, 16 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By TJ
Last Modified: శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (15:50 IST)

శివనామ స్మరణలతో మారుమ్రోగుతున్న శ్రీకాళహస్తి

ద్రాక్షారామం నుంచి శ్రీశైలం వరకు శ్రీకాళహస్తి నుంచి కోటిలింగాల వరకు శైవాలయాలు శివనామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాయులింగక్షేత్రం శ్రీకాళహస్తి భక్తులతో పోటెత

ద్రాక్షారామం నుంచి శ్రీశైలం వరకు శ్రీకాళహస్తి నుంచి కోటిలింగాల వరకు శైవాలయాలు శివనామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాయులింగక్షేత్రం శ్రీకాళహస్తి భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచే ఆలయం వద్ద భక్తులు బారులుతీరి కనిపిస్తున్నారు. ఉపవాస దీక్షలతో స్వామివారికి బిల్వార్చన చేస్తే ఎంతో మంచిదని పురాణాలు చెబుతున్నాయి. దీంతో భక్తులు ఉదయం నుంచే ఆలయానికి అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.
 
శ్రీకాళహస్తి ఆలయ దర్శనార్థం వచ్చిన భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యాన్ని కలిగించేలా దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. భక్తుల మధ్య ఎలాంటి తోపులాటలు జరుగకుండా దేవస్థానం అధికారులు జాగ్రత్త పడుతున్నారు. రాత్రికి స్వామివారి లింగోద్భవ దర్శనం జరుగనుంది. ఇప్పటికే ఎపి ప్రభుత్వం తరపున స్వామివారికి దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించారు.