శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 జులై 2017 (13:39 IST)

పశ్చిమ బెంగాల్‌లో ఘోరం.. చిన్నారిపై ఏడాది పాటు ప్రతిరోజూ మామయ్య అత్యాచారం..

పశ్చిమ బెంగాల్‌లో ఘోరం జరిగింది. పదేళ్ల చిన్నారిని ఆమె మామయ్య సంవత్సరం పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది పాటు రోజూ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. పదేళ్ల చిన్నారిపై ఢిల్ల

పశ్చిమ బెంగాల్‌లో ఘోరం జరిగింది. పదేళ్ల చిన్నారిని ఆమె మామయ్య సంవత్సరం పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది పాటు రోజూ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. పదేళ్ల చిన్నారిపై ఢిల్లీకి చెందిన ఆమె మామయ్య పెళ్లి చేసుకుంటానని ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన జమియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుల ఇంటికి వెళ్ళాడు. అక్కడ వున్న పదేళ్ల చిన్నారికి అతడు మామ వరుస అవుతాడు. 
 
దాన్నే అదనుగా తీసుకున్న అతడు చిన్నారి అని కూడా చూడకుండా.. అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్ళాక.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు. ఇటీవల చిన్నారిని వదిలి ఢిల్లీకి వెళ్ళడంతో అతడిపై బాలిక తల్లిదండ్రులకు వెల్లడించింది. దీంతో బాధిత చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు.