శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 అక్టోబరు 2021 (17:50 IST)

అదుపు తప్పిన మినీ బస్సు లోయలో పడి 11 మంది మృతి

అదుపు తప్పిన మినీ బస్సు లోయలో పడి 11 మంది మృతి చెందారు. ఈ దారుణమైన ఘటన జమ్మూ కశ్మీర్‌‌లో చోటుచేసుకుంది. ధాత్రి నుంచి దోడాకు వెళ్తున్న ఈ బస్సు అదుపు తప్పడంతో లోయలో పడిపోయింది. 
 
ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ప్రధానమంత్రి మోదీ. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల సాయం అందించనున్నట్లు వెల్లడించారు.