సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (17:14 IST)

పనాజీలో ప్రమాదంలో హీరోయిన్ దుర్మరణం

గోవా రాష్ట్ర పనాజీలో జరిగిన  ఓ ప్రమాదంలో హీరోయిన్ మృతి చెందారు. ఆమె నటించింది ఒక్క చిత్రమే. అయినప్పటికీ వర్థమాన నటిగా గుర్తింపు పొందిన ఈశ్వరీ దేశ్ పాండే (25) అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 
 
అంతేకాదు, వచ్చే నెలలోనే తనకు కాబోయే వాడితో నిశ్చితార్థం చేసుకుని జీవితంలో హాయిగా ఉండాలనుకుంది. కానీ, విధి మరొకటి తలచింది. రోడ్డు ప్రమాద రూపంలో ఆమెను, ఆమెకు కాబోయేవాడిని, వారి కలలను తీసుకెళ్లిపోయింది.
 
సోమవారం తెల్లవారుజామున గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె స్నేహితుడు, కాబోయే భర్త శుభమ్ దాద్గే (28)లు మరణించారు. ఈ నెల 15న గోవా పర్యటనకు వెళ్లిన వారిద్దరూ అనూహ్యంగా సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రమాదానికి గురయ్యారు.