శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (18:22 IST)

పొలంలో పనిచేస్తున్న తల్లికి భోజనం తీసుకెళ్తే.. దారిలో కీచకపర్వం.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై దురాగతాలకు బ్రేక్ పడట్లేదు. తాజాగా యూపీలోని ఝాన్సీలో ఓ కీచక పర్వం వెలుగు చూసింది. 16ఏళ్ళ అమ్మాయిని కొందరు దుండగుల

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై దురాగతాలకు బ్రేక్ పడట్లేదు. తాజాగా యూపీలోని ఝాన్సీలో ఓ కీచక పర్వం వెలుగు చూసింది. 16ఏళ్ళ అమ్మాయిని కొందరు దుండగులు పొలాల నుంచి అడవుల్లోకి లాక్కుపోయి.. అసభ్యకరంగా ప్రవర్తించారు. పొలంలో పనిచేస్తున్న తన తల్లికి ఆహారం తీసుకెళ్తున్న ఆ బాలికకు చేదు అనుభవం మిగిలింది. 
 
పొలంలో పనిచేస్తున్న తల్లికి ఆహారం తీసుకెళ్తున్న బాలికను తెలిసిన యువకుడే లిఫ్ట్ ఇస్తానని వెంట బెట్టుకుపోయాడు. దారిలో కొందరు ఆకతాయిలు అడ్డగించారు. బలవంతంగా ఆమెను లాక్కుపోయి.. లైంగికంగా వేధించారు. తనను వదిలేయమని ఆమె ప్రాధేయపడినా.. ఆ దుర్మార్గులు వదల్లేదు. వారిలో ఒకడు తన మొబైల్‌లో ఈ కీచకపర్వాన్ని చిత్రీకరించాడు.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 12వ తేదీన ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.