శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మే 2024 (17:10 IST)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

vehicle
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. కవర్ధా ప్రాంతలో లోయలో వాహనం ఒకటి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. కబీర్‌ధామ్ జిల్లాలో ఓ లోయలో వాహనం పడిపోయింది. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది. బైగా ట్రైబల్ కమ్యూనిటికీ చెందిన 25 నుంచి 30 మంది బీడీ ఆకుల కోసం వెళ్లారు. ఆకులు ఏరిన తర్వాత వారిని ఎక్కించుకున్న ఓ వాహనం తిరిగి బయలుదేరింది. 
 
ఆ సమయంలో ఈ వాహనం ప్రమాదవశాత్తు లోయలోపడిపోవడంతో ఈ ఘోరం జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా కుయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బైగా కమ్యూనిటీ ఎక్కువగా బీడీలను తయారు చేస్తుంది. బీడీ ఆకు కోసం వీరు అడవులకు వెళుతుంటారు. ఈ ఆకులు మార్చి నుంచి మే మధ్య వస్తాయి.