మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 17 మే 2024 (23:03 IST)

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

car accident
అతడిని మృత్యువు వెంటాడింది. కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ క్షణాల్లో మృత్యువు తిరిగి మరో కారు రూపంలో అతడి ప్రాణాన్ని కబళించింది. ఈ విషాదకర సంఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగింది.
 
వివరాలు ఇలా వున్నాయి. సంగారెడ్డి జిల్లాకు చెందిన 30 ఏళ్లు పృధ్వీరాజ్ గత ఏడాది శ్రీప్రియ అనే యువతిని పెళ్లాడి అమెరికాలో వుంటున్నాడు. నార్త్ కోలినాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. బుధవారం నాడు తన భార్యతో కలిసి కారులో వెళ్తుండగా వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో అతడి కారు ముందు వెళ్తున్న మరో కారుకి ఢీకొట్టి పల్టీ కొట్టింది.
 
తమ కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో ఇద్దరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. భార్యను కారులోనే కూర్చోబెట్టి అతడు బైటకు వచ్చి కారు పక్కగా నిలబడి పోలీసులకు ఫోన్ చేస్తున్నాడు. ఇంతలో రోడ్డుపై వేగంగా వచ్చిన మరో కారు అతడిని ఢీకొట్టింది. దాంతో పృధ్వీరాజ్ అక్కడికక్కడే ప్రాణాలో కోల్పోయాడు. పోస్టుమార్టం అనంతరం అతడి భౌతికదేహాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకురానున్నారు.