సోమవారం, 4 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (20:08 IST)

ముంబై ఆస్పత్రిలో నాలుగు మృతదేహాలు.. 15 ఏళ్ల క్రితం.. ?

ముంబై ఆస్పత్రిలో నాలుగు మృతదేహాలు కనిపించాయి, 15 ఏళ్ల క్రితం ఈ ఆస్పత్రిని మూసేశారు. హాస్పిటల్ బిల్డింగ్‌లో నాలుగు మృతదేహాలు లభించాయి. అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఈ ఘటన ముంబయిలోని కాందివలీలో చోటుచేసుకుంది.
 
15 ఏళ్ల క్రితమే మూసేసిన ఓ హాస్పిటల్ బిల్డింగ్‌లో ఓ కుటుంబం నివసిస్తుంది. అయితే, అదే నివాసంలో నలుగురు విగత జీవులై కనిపించారని పోలీసులు చెప్పారు. అంతేకాదు, అక్కడే నాలుగు సూసైడ్ నోట్లు కూడా లభించాయని వివరించారు. 
 
సెకండ్ ఫ్లోర్‌లో రక్తపు మడుగులో రెండు మృతదేహాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. మృతులను పోలీసులు గుర్తించారు. మృతులను కిరణ్ దాల్వి, ఆమె ఇద్దరు కుమార్తెలు ముస్కాన్, భూమిలుగా గుర్తించారు. మరొకరు శివదయాల్ సేన్‌గా పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.