శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (16:48 IST)

డబ్బులు పెట్టి నీటిని కొంటున్నారా? ఐతే వ్యాధుల్ని కూడా కొనుక్కున్నట్టే..!

డబ్బులు పెట్టి నీటిని కొంటున్నారా? ఐతే వ్యాధుల్ని కూడా చేర్చి కొనుక్కున్నట్టేనని వైద్యులు హెచ్చిరిస్తున్నారు. ఇంకా డబ్బు పెట్టి మరీ కొనుక్కునే నీటి ద్వారా ఉచితంగా రోగాలు కూడా వెన్నంటే వచ్చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజలు డబ్బు పెట్టి పలు రకాల బ్రాండ్లలో అమ్మే నీటిని కొనుక్కుని సేవిస్తున్నారు. ఇందులో 187 శ్యాంపిల్స్‌ను సేకరించిన గ్రేటర్ చెన్నై కార్పొరేషన్.. తాగునీటిలో నాణ్యత లోపించిన విషయాన్ని గుర్తించింది. 
 
శాంపిల్స్‌కు తీసుకున్న తాగునీరు తాగేందుకు పనికిరానివని తేలింది. మిగిలిన 187 శాంపిల్స్‌లో కేవలం 30 శాంపిల్స్‌లో ఆరోగ్యానికి కీడు చేసే బ్యాక్టీరియాలు వున్నట్లు తెలియవచ్చింది. ఇంకా 20 శాంపిల్స్‌లో ప్రముఖ బ్రాండ్లతో నకిలీ వాటర్ బాటిల్స్, క్యాన్లు అమ్ముతున్నట్లు తేలింది. ఈ వివరాలను నేషనల్ గ్రీన్ ట్రిబునల్ (ఎన్జీటీ)కు నివేదిక ద్వారా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సమర్పించినట్లు తెలిసింది. 
 
ఇలాంటి నాణ్యత లేని నీటిని సేవించడం ద్వారా ఉదర సంబంధిత రుగ్మతలు, టైఫాయిడ్, కలరా, డయేరియా వంటి వ్యాధులు సోకే అవకాశం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి క్యాన్ వాటర్ తాగే అలవాటును పక్కనబెట్టి ఇంటి బోర్‌వెల్‌లో వచ్చే నీటిని మరిగించి తాగడం చేస్తే బెటర్. అలా కాకుండా ఫ్యూరీఫైయర్ వాటర్ కాస్త మేలు. ఇవన్నీ వదిలిపెట్టి క్యాన్ వాటర్లను స్టైల్‌గా తాగారో.. రోగాలు కూడా అదే వేగంగా సోకడం చేస్తాయని వైద్యులు సెలవిస్తున్నారు.