శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (09:53 IST)

కేంద్రప్రభుత్వ శాఖల్లో 8.72 లక్షల పోస్టులు ఖాళీ

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సుమారు 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం సిబ్బంది శాఖ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు.

మొత్తం 40,04,941 పోస్టులకు గాను 2020 మార్చిలో ఒకటో తేదీ నాటికి 31,32,698 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని లిఖితపూర్వకంగా వెల్లడించారు.

2016-17 నుంచి 2020-21 వరకు ప్రధాన రిక్రూట్మెంట్ విభాగాలైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 25, 267 మందిని, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్ఎసీ) 2,14,601, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (ఆర్ఆర్బీలు) 2,04, 945 మందిని ఎంపిక చేసినట్టు ఆయన వివరించారు.

ఉద్యోగాల భర్తీ విషయంలో దృఢ నిశ్చయంతో ఉందని తెలిపారు. రానున్న భవిష్యత్తులో అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.