శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జులై 2021 (16:45 IST)

ఆ కుర్రాడికి 82 దంతాలు.. అవునా..?

సాధారణంగా ఎవరికైనా 32 దంతాలే ఉంటాయి. ఒకవేళ దంత సమస్యలేమైనా ఉంటే తక్కువ ఉండొచ్చు.. 32కు మించి దంతాలెవ్వరికీ ఉండవు. కానీ ఓ 17 ఏళ్ల కుర్రాడికి మాత్రం ఏకంగా 82 దంతాలున్నాయి. అవును కుర్రాడి నోట్లో ఏకంగా 82 దంతాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని పాట్నాకు చెందిన 17 ఏళ్ల నితీష్‌ కుమార్‌ దవడ నొప్పిగా ఉందని ఆసుపత్రికి వెళ్లాడు. అతడికి వైద్య పరీక్షలను నిర్వహించిన డాక్టర్లు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. రోగి దవడలో 82 దంతాలున్నాయని, అందువల్లే అతనికి నొప్పి వస్తోందని డాక్టర్లు నిర్థారించారు.
 
దవడలో ఏర్పడే ట్యూమర్‌ కారణంగా దంతాలన్నీ ఒకే దగ్గర ఎక్కువ మొత్తాల్లో పుట్టుకొస్తాయని, దానిని వైద్య పరిభాషలో ఒడొంటమా అంటారని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్‌ చేసి ఆ కుర్రాడి దవడలోని ట్యూమర్‌‌ని తొలగించామని, శస్త్రచికిత్స చేసేందుకు మూడు గంటల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్లు వివరించారు.