బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జనవరి 2025 (19:40 IST)

ఛత్తీస్‌గఢ్‌లో మావోల ఘాతుకం : 10 మంది జవాన్లు మృతి!!

naxalites
మావోస్టులు మరోమారు చెలరేగిపోయారు. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో ఘాతుకానికి పాల్పడ్డారు. సుకుమా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడు సంభవించిన సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. గత కొన్ని రోజులుగా భద్రతా బలగాల చేతిలో దెబ్బలు తింటున్న మావోయిస్టులు ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ దాడికి పాల్పడ్డారు. 
 
పోలీసు స్టేషన్‌ల మధ్య సరిహద్దు వివాదం... గంటలకొద్దీ రోడ్డుపైనే మృతదేహం!! 
 
పోలీస్ స్టేషన్‌లో మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ మృతదేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉండిపోయింది. పోలీసుల తీరుపై ఆగ్రహించిన మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు స్థానికులు జత కలిసి రోడ్డుపై బైఠాయించారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో మధ్యప్రదేశ్ పోలీసులు దిగొచ్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చెందిన రాహుల్ అహిర్వార్ అనే యువకుడు ఢిల్లీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే వివాహం జరిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలోనే రాత్రి 7 గంటలకు హర్పల్ పూర్ ఏరియాలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం రాహుల్‌ను ఢీ కొట్టింది. 
 
దీంతో తీవ్రగాయాలపాలైన రాహుల్.. అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో హర్పల్ పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆ ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబక్ నాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
దీంతో స్థానికులు మహోబక్‌నాథ్ పోలీసులకు సమాచారం అందించగా.. ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని, హర్పల్‌పూర్ పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు పట్టించుకోకపోవడంతో రాహుల్ మృతదేహం రోడ్డుపైనే పడి ఉంది. గంటలు గడుస్తున్నా పోలీసులు స్పందించకపోవడం, రాహుల్ కుటుంబ సభ్యుల రోదనలతో స్థానికులు మండిపడ్డారు. 
 
రాహుల్ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో చివరకు మహోబక్ నాథ్ పోలీసులు స్పందించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో రాహుల్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.