కుక్కల కాళ్లు - మూతులను తాళ్ళతో కట్టేసి చంపేశారు...

dogs
Last Updated: సోమవారం, 9 సెప్టెంబరు 2019 (12:30 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. 90 మూగజీవులైన శునకాలను అత్యంత కిరాతకంగా చంపేశారు. కాళ్ల, మూతులను తాళ్లతో కట్టేసి ఒకేచోట చంపేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో చోటుచేసుకుంది.

తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, గిర్దా - సవల్దాబారా రోడ్డుకు పక్కన ఉన్న పదుల సంఖ్యలో కుక్కల కళేబరాలు పడివుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గిర్డా రహదారిని పరిశీలించగా.. ఐదు ప్రాంతాల్లో సుమారు 90 శునకాల కళేబరాలను గుర్తించారు.

ఆ తర్వాత అటవీ శాఖ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు కుక్కల కళేబరాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేస్తున్నారు.

ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే కుక్కల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుక్కలను పట్టేవారిని కూడా విచారిస్తున్నారు.
దీనిపై మరింత చదవండి :