1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 23 నవంబరు 2017 (10:10 IST)

అంగట్లో 'లోకల్ ఫిలిం' పేరుతో అత్యాచారాల వీడియోల విక్రయం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటికీ.. అత్యాచారాలు, నేరాలు ఘోరాల పర్వాలకు మాత్రం ఫుల్‌స్టాఫ్ పడలేదు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీలో ప్రతి రోజూ ఏదో ఒకచోట మహిళలు అభాసుపాలవుతూన

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటికీ.. అత్యాచారాలు, నేరాలు ఘోరాల పర్వాలకు మాత్రం ఫుల్‌స్టాఫ్ పడలేదు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీలో ప్రతి రోజూ ఏదో ఒకచోట మహిళలు అభాసుపాలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ యువకుడు అమ్మాయిపై అత్యాచారం చేస్తుండగా... ఆ దృశ్యాలను మరో యువకుడు చిత్రీకరించిన వీడియోలను కొందరు వ్యాపారులు అంగట్లో "లోకల్ ఫిలిం'' పేరిట యథేచ్చగా విక్రయిస్తున్న విషయం బయటపడింది. 
 
యువకులు, విద్యార్థుల్లో రేప్ వీడియోలకు డిమాండ్ పెరగడంతో కొందరు వ్యాపారులుగుట్టుగా వీటిని లోకల్ ఫిలిమ్స్ పేరిట పెన్ డ్రైవ్‌లలో వేసి విక్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయిస్తున్న నాకా హిందోళ మార్కెట్‌లో రేప్ వీడియోల విక్రయం జోరుగా సాగుతోంది. గతంలో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఉపయోగపడిన ఈ రేప్ వీడియోలు ప్రస్తుతం వ్యాపార వస్తువులుగా మారాయి. 
 
రేప్ వీడియోలు విక్రయిస్తున్న నాకా హిందోళ మార్కెట్‌కు కేవలం ఐదు వందల మీటర్ల దూరంలోనే పోలీసుస్టేషన్ ఉన్నా వారు వ్యాపారుల నుంచి ముడుపులందుకొని ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని వ్యాపారులే చెపుతున్నారు. గతంలో పైరేటెడ్ ఫిలిం వీడియోలు విక్రయించే వ్యాపారులు యువత డిమాండును బట్టి ఇప్పుడు రేప్ వీడియోలను విక్రయిస్తున్నారు. 10 నిమిషాల నుంచి 30 నిమిషాల నిడివిగల రేప్ వీడియోను 300 నుంచి 500 రూపాయల దాకా విక్రయిస్తున్నారు. 
 
దీనిపై వ్యాపారులు స్పందిస్తూ, అత్యాచార వీడియోలను ఐదువేల రూపాయలకు కొని రేపిస్టు ముఖం కనిపించకుండా బ్లర్ చేసి దానికి బాధిత అమ్మాయి పెట్టే కేకలతో కూడిన ఆడియో ట్రాక్ జోడించి వంద నుంచి రెండు వందల రూపాయలకు కూడా వీటిని బహిరంగంగానే విక్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన యువకులు వచ్చి ఈ రేప్ వీడియోలను కొంటున్నారని తెలిపారు.