రాంగ్ రూటులో వచ్చిన కారు ముందు బైకుతో నిలబడి? (వీడియో)
రాంగ్ రూటులో వచ్చిన ఓ కారు ముందు నిలబడి.. ఆ కారు డ్రైవరుకు చుక్కలు చూపించిన ఓ యువకుడు హీరో అయిపోయాడు. రాంగ్ రూటులో వచ్చిన కారుకు ముందు నిల్చుని.. ఆ కారును అట్టా ఇట్టా కదలాడనీయకుండా చేసిన ఉదంతమంతా.. సీ
రాంగ్ రూటులో వచ్చిన ఓ కారు ముందు నిలబడి.. ఆ కారు డ్రైవరుకు చుక్కలు చూపించిన ఓ యువకుడు హీరో అయిపోయాడు. రాంగ్ రూటులో వచ్చిన కారుకు ముందు నిల్చుని.. ఆ కారును అట్టా ఇట్టా కదలాడనీయకుండా చేసిన ఉదంతమంతా.. సీసీటీవీ కెమెరాలో రికార్డయిపోవడం.. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే ఈ నెల మూడో తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సాహిల్ బటవ్ (22) అనే విద్యార్థి రహదారిపై బైక్‌పై వెళ్తుండగా మహీంద్రా థార్ అనే కారు అడ్డదారిలో అతనికి ఎదురుగా వచ్చింది. దీంతో సాహిల్ ఆ వాహనం ఎదుట అలాగే బైక్‌పై ఉన్నాడు. ఎంతసేపటికీ కదలలేదు. అనంతరం సాహిల్ బైక్ దిగి ఆ వాహనం నంబర్ ప్లేట్‌ను ఫొటో తీశాడు. ఆ తర్వాత కారులోంచి దిగిన ఇద్దరు కూడా సాహిల్ బైక్ నెంబర్ ప్లేటును ఫోటో తీశారు.
అయితే ఆ వ్యక్తి అంతటితో ఆగలేదు. ఏకంగా సాహిల్‌పై దాడికి దిగాడు. కానీ కొంతసేపటికే జనాలు చేరిపోయారు. ఈ క్రమంలోనే సాహిల్ సదరు వ్యక్తిపై కంప్లెయింట్ ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. కాగా సదరు వ్యక్తి సాహిల్‌కు ఎదురుగా రావడం, అనంతరం అతన్ని కొట్టడం తదితర దృశ్యాలన్నీ అక్కడే ఉన్న ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆ దృశ్యాలను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. సాహిల్‌ను మెచ్చుకుంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. దీంతో సాహిల్ హీరో అయిపోయాడు.