గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2017 (13:58 IST)

ఒంటరిగా వెళ్ళే యువతిని రేప్ చేయబోయాడు.. సీసీ కెమెరాకు చిక్కాడు.. (వీడియో)

ఒంటరిగా వెళ్తున్న బాలికలు, యువతులు, మహిళలపై వేధింపులు జరుగుతూనే వున్నాయి. రోజు రోజుకీ మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కొజికోడ్‌లో ఓ యువతిని వేధించి.. అత్యాచారం చేయబోయిన వ్యక్తి వీడియో

ఒంటరిగా వెళ్తున్న బాలికలు, యువతులు, మహిళలపై వేధింపులు జరుగుతూనే వున్నాయి. రోజు రోజుకీ మహిళలపై అకృత్యాలు  పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కొజికోడ్‌లో ఓ యువతిని వేధించి.. అత్యాచారం చేయబోయిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కొజికోడ్‌కి చెందిన 31 ఏళ్ల జంషీర్, ఓ యువ‌తి వెళ్లే దారిలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో అత్యాచారయత్నం చేశాడు. 
 
కానీ ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో.. అక్కడి నుంచి పారిపోయాడు. అత‌ను యువతితో నడిచి వెళ్లడం.. ఆపై యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడటం.. ఆమె కేకలు పెట్టడంతో అక్కడ నుంచి పారిపోవడమంతా.. సీసీ కెమెరాలో రికార్డైనాయి.

ఈ వీడియోలో జంషీర్ ముఖం స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌టంతో బాధితురాలు ఫిర్యాదు చేసిన మూడు రోజుల్లోనే న‌డ‌క్క‌వ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. జంషీర్‌కు అత్యాచారయత్నం, మహిళలపై వేధింపులు కొత్తేమీ కాదని.. అతడిపై ఇప్పటికే అత్యాచారయ‌త్నం కేసులు ఉన్నాయ‌ని పోలీసులు వెల్లడించారు.