గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (10:01 IST)

స్కూల్ గర్ల్‌పై స్పీకర్ అత్యాచారం.. వాష్‌రూమ్‌కి లాక్కెళ్లి...

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ దారుణం జరిగింది. అన్యపుణ్యం తెలియని ఓ చిన్నారిపై పాఠశాలలో స్వీపర్‌గా పని చేసే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ దారుణం జరిగింది. అన్యపుణ్యం తెలియని ఓ చిన్నారిపై పాఠశాలలో స్వీపర్‌గా పని చేసే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబై నగర శివారు ప్రాంతంలోని కల్యాణ్ నగరంలోని ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖడేగోలివాలి ప్రాంతానికి చెందిన ప్రదీప్ మహాజన్ (47) స్వీపరుగా పనిచేస్తున్నాడు. ఆ పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల బాలికను స్వీపర్ వాష్ రూంలోకి తీసుకువెళ్లి ఆమెను లైంగికంగా వేధించాడు. 
 
ఈ విషయం గురించి ఎవరికీ చెప్పవద్దని ప్రదీప్ బాలికను బెదిరించాడు. బాలిక రెండోరోజు లైంగికవేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు నిందితుడైన ప్రదీప్ మహాజన్‌ను అరెస్టు చేశారు. నిందితుడైన ప్రదీప్‌ను పాఠశాల స్వీపరుగా తొలగించామని పాఠశాల ప్రిన్పిపాల్ చెప్పారు.