శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2017 (17:26 IST)

ఐర్లాండ్ పాఠశాలలో దెయ్యం.. కబోర్డ్‌లోని పుస్తకాలను విసిరేసింది (వీడియో)

ఐర్లాండ్‌లోని ఓ పాఠశాలలో దెయ్యం ప్రవేశించింది. ఎవ్వరూ లేని సమయంలో పాఠశాలలోకి వెళ్లిన ఆ దెయ్యం విద్యార్థులు లాకర్లలో వుంచిన పుస్తకాలను విసిరివేసింది. లాకర్లను కదిలించింది. మూసి వుంచిన లాకర్లలో గల వస్తు

ఐర్లాండ్‌లోని ఓ పాఠశాలలో దెయ్యం ప్రవేశించింది. ఎవ్వరూ లేని సమయంలో పాఠశాలలోకి వెళ్లిన ఆ దెయ్యం విద్యార్థులు లాకర్లలో వుంచిన పుస్తకాలను విసిరివేసింది. లాకర్లను కదిలించింది. మూసి వుంచిన లాకర్లలో గల వస్తువులను బయటికి తోసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  
 
ఐర్లాండ్‌లోని కార్గ్ నగరంలో 1828వ సంవత్సరం నిర్మించబడిన పాఠశాల ఒకటి వుంది. ఈ పాఠశాలలో అనేక మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి పూట పాఠశాలలోని విద్యార్థులు పుస్తకాలను వుంచే కబోర్డు నుంచి పుస్తకాలు బయటికి విసిరేయబడుతున్నాయి. ఆపై ఓ నలుపు ఆకారంలోని ఓ రూపం నడిచి వెళ్తున్నట్లు గల దృశ్యాలు సీసీటీవీ వీడియోలో రికార్డైనాయి. ఈ వీడియోను మీరూ చూడండి.