మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (09:10 IST)

మాజీ ప్రేమికుడితో భార్య సరసాలు.. భార్య హత్య చేయించాడు.. ఎవరిని?

వివాహేతర సంబంధాలు.. వాటి ద్వారా సంభవించే నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. తన భార్య మాజీ ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆగ్రహంతో అతని హత్య చేయించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన భార్

వివాహేతర సంబంధాలు.. వాటి ద్వారా సంభవించే నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. తన భార్య మాజీ ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆగ్రహంతో అతని హత్య చేయించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన భార్యతో ఆమె మాజీ ప్రియుడు వివాహానంతరం కూడా సంబంధాలు కొనసాగించడంపై ఆమె భర్త జీర్ణించుకోలేకపోయాడు. దీంతో కిరాయి హంతకులతో అతనిని హత్య చేయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఇండోర్ నగరంలోని అహ్మద్ నగర్‌కు చెందిన ఇస్లాముద్దీన్ (28) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఇస్లాముద్దీన్ భార్య పెళ్లికి ముందు మాజిద్ అనే యువకుడిని ప్రేమించింది. వివాహానంతరం కూడా మాజిద్ మాజీ ప్రియురాలితో అక్రమసంబంధాన్ని కొనసాగించాడు. తన భార్య మాజిద్‌తో సన్నిహితంగా ఉండగా ఇస్లాముద్దీన్ పట్టుకున్న భర్త అతడిని హెచ్చరించాడు. 
 
అయినా చెప్పిన మాట వినకపోవడంతో మాజిద్‌ను ఎలాగైనా హత్య చేయించాలని ఇస్లాముద్దీన్ నిర్ణయించుకొని రూ.5లక్షల రూపాయలిచ్చి కిరాయి హంతకులతో హతమార్చాడు. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్స్ రికార్డులను పరిశీలించిన పోలీసులకు హత్య గుట్టు రట్టు అయింది. నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుపై దర్యాప్తు జరుపుతున్నారు.