శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (09:47 IST)

శృంగార సామర్థ్యం పెరగాలంటే.. రోజూ యాలకులు తినాలి

శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తినాలి. ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. సంతాన సాఫల్యత అవకాశాలు పెంచుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు ర

శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తినాలి. ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. సంతాన సాఫల్యత అవకాశాలు పెంచుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ యాలకులను తినాలి. దీంతో రక్తం పెరుగుతుంది. శరీరంలో వున్న విష, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి.
 
భోజనం చేసిన వెంటనే ఒకటి రెండు యాలకులను నములుతూ ఉంటే నోటి దుర్వాసన పోతుంది. జీర్ణ సమస్యలు వుండవు. ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో యాలకులు మెరుగ్గా పనిచేస్తాయి. రోజుకు మూడు, నాలుగు సార్లు కొన్ని యాలకులను తీసుకుని బాగా నమిలి చప్పరిస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకులను రోజూ తింటుంటే గుండె సమస్యలు పోతాయి. 
 
రక్త సరఫరా మెరుగు పడుతుంది. రెండు, మూడు యాలకులు, లవంగాలు, చిన్న అల్లం ముక్క, ధనియాలను తీసుకుని పొడి చేయాలి. దీన్ని ఒక గ్లాసు వేడి నీటిలో కలుపుకుని తాగితే అజీర్ణ సమస్య పోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.