కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే... వంకాయ తినండి..
కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే.. వారానికి రెండుసార్లు వంకాయలు తినండి. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి వంకాయలు ఎంతో దోహదపడతాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. ఆంటీబయోటిక్‌గ
కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే.. వారానికి రెండుసార్లు వంకాయలు తినండి. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి వంకాయలు ఎంతో దోహదపడతాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. ఆంటీబయోటిక్‌గా కూడా వంకాయ పనిచేస్తుంది. అలాగే రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఒక్క టమాటాకే ఉంది. శరీరంలో విషపదార్థాలను తొలగిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి టమాటాలు ఎంతో మేలుచేస్తాయి.
టమాటాలతో బరువు తగ్గడంతోపాటు స్థూలకాయం కూడా బాగా తగ్గుతుంది. దోసకాయతో కూడిన ఆహారం ఒంటికి ఎంతో చలువ. జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. కడుపు నొప్పి పొట్ట ఉబ్బడం వంటి వ్యాధులను దూరం చేస్తుంది.
వర్షాకాలంలో మాంసాహారం కంటే శాకాహారం ఎక్కువగా తీసుకుంటే పోషకాలు అధిక మొత్తంలో లభిస్తాయి. అధిక విటమిన్లతో కూడిన ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మినరల్స్ విటమిన్లు కార్బొహైడ్రైట్‌లు ఉన్న పోషకాహారం ఆరోగ్యానికి దివ్యౌషదంగా పనిచేస్తుంది. ఏ విటమిన్ కోసం క్యారెట్ బి విటమిన్ కోసం సోయాబిన్, సీ విటమిన్‌కు టమాటా, డీ విటమిన్‌కు వెన్న ఈ విటమిన్ కోసం ఆకుకూరలు, కూరగాయలు కె విటమిన్ కోసం బంగాళాదుంపలు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.