శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 3 జనవరి 2019 (14:36 IST)

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆరుగురితో పెళ్లి.. ఏడోసారి జంప్

ఓ కిరాణా కొట్టు యజమాని ఆరుగురు మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడవ సారి ఓ అమ్మాయితో జంప్ అయ్యాడు. ఈ ఘటన తమిళనాడు, దిండుక్కల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  దిండుక్కల్, తెన్నంపట్టి ప్రాంతానికి చెందిన మురుగన్.. ఓ కిరాణా కొట్టు యజమాని. ఇతడు ఆరుగురిని ప్రేమ పేరుతో మోసం చేసి వివాహం చేసుకున్నాడు. 
 
ఆరోసారిగా రాధ అనే మహిళను పెళ్లాడాడు. పెళ్లైన కొద్దిరోజులకు వీరి వివాహం సజావుగా సాగింది. వీరికి ఓ అబ్బాయి పుట్టాడు. రాధ రెండోసారి గర్భం దాల్చింది. కానీ ‌మురుగన్‌కున్న అప్పులతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మురుగన్ కొద్ది రోజుల క్రితం కనిపించకుండాపోయాడు. భర్త కనిపించకపోవడంతో రాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు షాకయ్యే వివరాలు వెలుగులోకి వచ్చాయి. మురగన్ ఐదుగురు మహిళలను వివాహం చేసుకుని మోసం చేశాడని, ఆరో భార్య రాధను వదిలి ఏడోసారిగా ఓ అమ్మాయితో లేచిపోయాడని తెలిసింది. దీంతో తాను మోసపోయాననే వార్తవిని ఆ గర్భిణిగా వున్న రాధ షాకైంది. పరారీలో వున్న మురుగన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.