బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 18 నవంబరు 2016 (21:53 IST)

నల్లధనమా...? వంకాయా...? చూడండి కిటికీలో నుంచి ఎలా వస్తుందో డబ్బు... (Video)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఓవైపు సామాన్యుడు కరెన్సీ నోట్లు అందక నానా తంటాలు పడుతున్నాడు. ఉదయం లేచిన దగ్గర్నుంచి బ్యాంకుల ఎదుట క్యూల్లో నిలబడి డబ్బు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్యూ లైన్లలో నిరీక్షిస్తూ కొంతమంది ప్రాణాలు సైతం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఓవైపు సామాన్యుడు కరెన్సీ నోట్లు అందక నానా తంటాలు పడుతున్నాడు. ఉదయం లేచిన దగ్గర్నుంచి బ్యాంకుల ఎదుట క్యూల్లో నిలబడి డబ్బు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్యూ లైన్లలో నిరీక్షిస్తూ కొంతమంది ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఐతే కొంతమంది బ్యాంకు సిబ్బంది మాత్రం ఇదే అదనుగా తమ చేతివాటం చూపిస్తున్నారు. 
 
తమవారికి బ్యాంకు వెనుక కిటీకల నుంచి నోట్ల కట్టలు దర్జాగా తరలించేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసినవారు నల్లధనమా వంకాయా... హేపీగా నల్లధనం పోగేసుకున్నవారు చక్కగా ఇలా దొడ్డిదోవన వచ్చి కట్టలు కట్టల డబ్బును దర్జాగా జేబుల్లో వేసుకుని వెళ్లిపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు. చూడండి ఈ వీడియోను...