శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:05 IST)

కోడలిని రేప్ చేశాడు, కొడుకుకి తెలియడంతో...

కోడలు అంటే కూతురితో సమానం. భర్త ఏవిధంగా కాపాడుతాడో మామ కూడా అదేవిధంగా కాపాడాలి. కానీ ఇక్కడ ఆ మామ మాత్రం కామంతో రగిలిపోయాడు. సొంత కోడలు అని కూడా చూడకుండా దారుణంగా అత్యాచారం చేశాడు. కొడుక్కి చెబితే చంపేస్తానన్నాడు. వారంరోజుల పాటు మౌనంగా ఉన్న కోడలు తన బాధను భర్తకు చెప్పడంతో ఇంట్లో పెద్ద గొడవ జరిగింది.
 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్‌పూర్‌లో నివాసముండే జమాద్ స్థానికంగా సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. కుమారుడు షబ్బీర్‌కు రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసేవాడు. ఇంట్లో కొడుకు, కోడలితో ఇతను ఉండేవాడు. షబ్బీర్ స్థానికంగా బేకరీలో పనిచేసేవాడు. ఉదయం ఇంటి నుంచి వెళితే సాయంత్రానికి వచ్చేవాడు.
 
జమాద్ రాత్రి వెళితే ఉదయాన్నే ఇంటికి వస్తాడు. రెండు సంవత్సరాలవుతున్నా షబ్బీర్‌కు పిల్లలు లేరు. అయితే జమాద్ భార్య అనారోగ్యంతో ఎనిమిది సంవత్సరాల క్రితమే చనిపోయింది. దీంతో కోడలిపై కన్నేశాడు జమాద్. వారంరోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. 
 
ఈ విషయాన్ని భర్తకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. రెండవ రోజు అత్యాచారం చేశాడు జమాద్. దీంతో మామ అలా చేయడంతో ఆవేదనకు గురైంది. తన బాధను మనస్సుల్లోనే ఉంచుకుంది. భార్య మౌనంగా ఉండడంతో షబ్బీర్ గట్టిగా నిలదీశాడు. నిన్న సాయంత్రం అసలు విషయాన్ని భర్తకు చెప్పింది భార్య.
 
దీంతో షబ్బీర్ కోపంతో తండ్రి పనిచేస్తున్న సంస్థ దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. దీంతో తన పక్కనే ఉన్న రాడ్‌ను తీసుకుని కొడుకు పొట్టలో దించాడు జమాద్. అక్కడికక్కడే కుప్పకూలాడు షబ్బీర్. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.