మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (15:57 IST)

రూ.95లక్షలకు పైగా విలువ చేసే మద్యం.. ఓ మహిళ నేలపాలు చేసింది..

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే వాటిల్లో మద్యం కూడా ఒకటి. ప్రభుత్వాలకు అధిక ఆదాయం ఇచ్చేది కూడా మద్యమే. ఇలాంటి మద్యాన్ని ఓ మహిళ నేలపాలు చేసింది. అదీ వందో వెయ్యి రూపాయల మద్యమో కాదు... రూ.95లక్షలకు పైగా విలువ చేసే మద్యం. 500 బాటిళ్ల విలువైన మద్యాన్ని ఓ మహిళ పగలగొట్టింది. ఈ సంఘటన యూకేలోని ఓ సూపర్ మార్కెట్లో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. హెర్డ్ ఫోర్డ్ షైర్‌లోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన మహిళ వస్తువులు కొనుగోలు చేయకుండా, ర్యాక్‌లో ఉన్న మద్యం బాటిళ్లను ఒక్కొక్కటిగా తీసుకొని పగలగొట్టడం మొదలుపెట్టింది. 500 బాటిళ్లను పగలగొట్టింది. వాటి విలువ 1,30,000 డాలర్లు ఉంటాయట. 
 
మద్యం బాటిళ్లు పగలగొడుతుంటే, సూపర్ మార్కెట్ యాజమాన్యం అడ్డుకోలేదు. పోలీసులకు ఫోన్ చేసి ఊరుకున్నారు. అయితే, ఆ మహిళ మద్యం బాటిళ్లను ఎందుకు పగలగొట్టిందనే విషయాన్ని సూపర్ మార్కెట్ అధికారులు వెల్లడించలేదు.