మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (12:34 IST)

పనికి డుమ్మా కొడుతుందని మైనర్ బాలికను చితకబాదిన యజమాని.. వీడియో వైరల్

మైనర్ బాలికలు పని మనుషులు నియమించడం తప్పని బాలల సంక్షేమ సంఘాలు చెప్తుంటే.. మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడమే కాకుండా.. ఆ బాలిక పనికి డుమ్మా కొడుతుందని.. సరిగ్గా పనిచేయట్లేదని ఓ ఇంటి యజమాని ఆ బాలిక పట్ల

మైనర్ బాలికలు పని మనుషులు నియమించడం తప్పని బాలల సంక్షేమ సంఘాలు చెప్తుంటే.. మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడమే కాకుండా.. ఆ బాలిక పనికి డుమ్మా కొడుతుందని.. సరిగ్గా పనిచేయట్లేదని ఓ ఇంటి యజమాని ఆ బాలిక పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

బాలికను అమానుషంగా చితకబాదిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు సదరు ఇంటి యజమానిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ పెరిగిపోతుండటంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. కానీ మైనర్ బాలికను తీవ్రంగా కొట్టిన వ్యక్తి పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
పనికి సరిగ్గా రావట్లేదని.. ఆ మైనర్ బాలిక ఎంత వద్దని చెప్పినా.. నొప్పిగా ఉందని వేడుకున్నా.. ఆ రాక్షసుడు బాలికను చితకబాదాడు. అయితే ఆ బాలికను కొడుతునప్పుడు ఎవరో ఆ ఇంట్లోని వారే వీడియో తీసి మీడియాకి ఇచ్చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు ఫైర్ అయిపోతున్నారు. మైనర్‌పై చేజేసుకున్న కిరాతకుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.