శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (15:36 IST)

నేను కాగితపు పువ్వును కాదు.. విత్తనాన్ని: కమల్‌ హాసన్‌

రాజకీయాల్లోకి వస్తున్న సినీ హీరోలు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ కాగితపు పూలు వంటివారనీ డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.కె.స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై విశ్వనటుడు కమల్ హాసన్ కూడా తనదైనశైలిలోస్పందించారు.

రాజకీయాల్లోకి వస్తున్న సినీ హీరోలు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ కాగితపు పూలు వంటివారనీ డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.కె.స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై విశ్వనటుడు కమల్ హాసన్ కూడా తనదైనశైలిలోస్పందించారు. 
 
'నేను కాగితపు పువ్వును కాదు, విత్తనాన్ని. దానిని నాటి చూస్తే ఏపుగా పెరుగుతా. విత్తనాన్ని ఎవరూ వాసన చూడాల్సిన పని లేదు' అని వ్యాఖ్యానించారు. రాజకీయ రంగంలో కొత్త శకాన్ని ప్రారంభించడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలంటూ ట్వీట్‌ చేశారు.
 
కాగా, బుధవారం మదురై వేదికగా కమల్ హాసన్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్న విషయం తెల్సిందే. దీనిపై స్టాలిన్ స్పందిస్తూ, రుతువులు మారినప్పుడు కొన్ని కాగితపు పూలు అందంగా వికసిస్తాయి తప్ప.. సువాసనలు వెదజల్లవని, అవి వికసించిన వేగంతోనే నేలరాలిపోతాయని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు కమల్ హాసన్ పైవిధంగా కౌంటర్ వేశాడు.