శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

నేను చాలా మొండోడిని... పైగా బలవంతుడిని : పవన్ 'కత్తి'లాంటి కౌంటర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కత్తిలాంటి వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కత్తిలాంటి వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, ఇటీవల తన జపం చేస్తూ విమర్శలు గుప్పించిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌లు లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్నాయి. 
 
పవన్ కల్యాణ్ ప్రస్తుతం తెలంగాణలో 'చలోరే.. చలోరే చల్' యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కొండగట్టు ఆంజనేయస్వామికి పూజలు చేసిన రాజకీయ యాత్ర ప్రారంభించిన పవన్, ఈ యాత్రలో జనసేన పార్టీకి సంబంధించిన వ్యవస్థాగత ఏర్పాట్ల గురించి వివరిస్తూ వెళుతున్నారు. యాత్రలో కత్తి ప్రస్తావన కూడా వచ్చిందనే టాక్ నడుస్తుంది. దీనిపై పవన్ మాట్లాడుతూ, 
 
"భారతదేశంలో చాలా సమస్యలున్నాయి. కానీ అవన్నీ వదిలేసి కొందరు కావాలనే నన్ను టార్గెట్ చేశారు. అలాంటి వారందరినీ ఎదుర్కోవడానికి సిద్ధపడే వచ్చాను. నేను కూడా చాలా మొండివాడినే. అందులో నేను బలవంతుడిని. ఇలాంటివి చూసి పిరికివాడిలా పారిపోయే వ్యక్తిని అయితే కాను. బలవంతుడు మాత్రమే భరించగలడు. ఎవరెన్ని మాటలన్నా భరిస్తా. ఆ శక్తి నాకుంది. అయితే కార్యకర్తలుగా మీరు మాత్రం ఎక్కువగా రియాక్ట్ అవకండి. నాకన్నీ తెలుసు, నేను చూసుకుంటాను" అంటూ పవన్ తన అభిమానులకు సూచనలు చేశారు.