సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (06:13 IST)

కేసీఆర్ స్మార్ట్ సీఎం... చిరంజీవి కాంగ్రెస్ నేత : పవన్ కళ్యాణ్

ప్రజా సమస్యల అధ్యయనం కోసం తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ నాయకుడేనని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యల అధ్యయనం కోసం తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ నాయకుడేనని స్పష్టం చేశారు. 
 
ఈ యాత్రలో భాగగా, కరీంనగర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను స్మార్ట్‌గా పని చేస్తారని అంటే కొంతమంది నాయకులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. అలాగే, తన అన్నయ్య చిరంజీవి కూడా కాంగ్రెస్‌ నాయకుడే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. 
 
కేసీఆర్‌ అంటే తనకు ముందునుంచీ ఇష్టమేనని, రాజకీయాల్లో ఉంటూ ప్రజల కోసం కష్టపడే నాయకులను తాను ఇష్టపడతానన్నా రు. తనకు ఏ పార్టీ మీద ద్వేషం లేదని, ఆంధ్రాలో తిరుగుతావ్‌.. తెలంగాణకు ఎందుకు రావని అడిగితే వస్తానని చెప్పి ఈరోజు వచ్చానన్నారు.