అయోధ్య వివాదానికి 134 సంవత్సరాలు.. కీలక ఘట్టాలు (video)

ramayan
సెల్వి| Last Updated: శనివారం, 9 నవంబరు 2019 (11:56 IST)
అయోధ్య వివాదానికి ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టనుంది. సుప్రీం కోర్టు. రెండున్నర దశాబ్ధాలు.. 134 సంవత్సరాలుగా వివాదంలో వున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శనివారం తుది తీర్పు వెలువరించనుంది.

దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడిన ఈ కేసుపై తుది తీర్పు ఇవ్వడం సుప్రీం కోర్టుకే తలకుమించిన భారమవగా.. ఇప్పటికే కేసుకు సంబంధించి విచారణ ముగిసింది.

ఈ తీర్పు కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలో ఎలాంటి తీర్పును వినవలసి వస్తుంది అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం పక్షాల నడుమ దశాబ్దాల నుంచి వివాదం నడుస్తుంది. 1992 డిసెంబర్ 6న హిందువులు కొందరు ఉత్తరప్రదేశ్‌‍లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టారు. ఇది శ్రీరాముడు జన్మించిన స్థలంగా.. రామజన్మభూమిగా హిందువులు భావించారు. అయోధ్య నగరంలో ఇప్పటికే 144 సెక్షన్‌ను విధించారు.

అయోధ్యకు సంబంధించి కీలక ఘట్టాలు
అయోధ్యపై సుప్రీం తీర్పుతో పాటు బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం ఉన్న సందర్భంగా డిసెంబర్-10, 2019 వరకు అయోధ్యలో 144 సెక్షన్ విధించారు.

1959: అయోధ్య వివాదాస్పద స్థలంపై తమకే హక్కుందని కోర్టును ఆశ్రయించిన నిర్మోహి అఖాండా సంస్థ.

1981: అయోధ్య వివాద స్థలం తమదేనని ముస్లిం వర్గానికి చెందిన సున్నీ వక్ఫ్ బోర్డు తరుపున కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.


1990: అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్‌కే అద్వానీ రామ రథయాత్రను ప్రారంభించారు.

1992: డిసెంబర్ 2న బాబ్రీ మసీదును కూల్చివేసిన కర సేవకులు.


2010: డిసెంబర్ 30న వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని కక్షిదారులు పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.దీనిపై మరింత చదవండి :