1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మే 2023 (09:31 IST)

భార్యతో గొడవలు.. ఆత్మహత్య చేసుకున్న భర్త.. అఘోరా ఏం చేశారో తెలుసా?

aghora pooja
అత్మహత్య చేసుకున్న తన స్నేహితుడి మృతదేహంపై ఓ అఘోరా కూర్చొని పూజలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరు జిల్లాలోని సలూర్ సమీపంలో కురుంబపాళెయానికి చెందిన మణికంఠన్ అనే వ్యక్తి ఓ అంబులెన్స్ డ్రైవర్. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య నిత్యం గొడవలే. దీంతో తీవ్రంగా కలత చెందిన మణికంఠన్ ఆదివారం విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
మణికంఠన్‌కు చిన్ననాటి స్నేహితుడు తిరుచ్చికి చెందిన అఘోరా ఒకరు ఉన్నారు. ఈయనకు ఈ విషయం తెల్సింది. దీంతో ఆయన మరికొందరు అఘోరాలతో కలిసి సలూర్ వచ్చిన స్నేహితుడి మృతదేహంపై కూర్చొని పూజలు చేశారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.