శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 19 మే 2015 (12:43 IST)

ఎస్పీ నేత సెక్యూరిటీ గార్డు కన్నుకొట్టాడనీ రోడ్డుపై హల్‌చల్ సృష్టించిన అక్కా చెల్లెళ్లు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ నేత అభినవ్ శర్మ సెక్యూరిటీ గార్డులు తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఆగ్రాకు చెందిన అక్కాచెల్లెళ్లు రోడ్డుపై హల్‌చల్ సృష్టించారు. రోడ్డుపై ఆయన బెంజ్ కారును ఆపి బాయినెట్‌పైకి ఎక్కి నిరసన తెలిపారు. వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన క్రేజును తెచ్చుకుంది.
 
తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... సాధ్వీ పాండే అనే యువతి తన సోదరితో కలసి ఓ సిగ్నల్ దగ్గర ఆగిన సమయంలో అభినవ్ శర్మ బాడీ గార్డులు ఆమెకు కన్నుకొట్టారు. వారి ఫోటోలు తీయబోగా, సెల్ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె ధైర్యంగా బండి దిగి కారు ఎక్కి నిరసన తెలిపింది.
 
కారు ముందున్న సమాజ్‌వాదీ పార్టీ జెండాను ఊడబెరికి దాంతోనే కారు అద్దాలు పగులగొట్టింది. తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆ చుట్టుపక్కల ఉన్నవారు సైతం ఆమెకు మద్దతు తెలపడంతో చేసేదేమీ లేక క్షమాపణ చెప్పి పరిహారంగా రూ.6,500 ఇచ్చి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఆ సమయంలో వాహనంలో అభినవ్ శర్మ ఉన్నారా అన్న విషయంపై స్పష్టత రాలేదు.