గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (18:05 IST)

ఇంట్లో కుమార్తెను వదిలి ప్రియుడుతో భార్య పరార్... రెడ్‌‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

అర్థరాత్రి కుమార్తెను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి ప్రియుడుతో కలిసి భార్య పారిపోయింది. ఉదయం వరకు ఆమె రాకపోవడంతో ఆమె కోసం ఇంటి గుమ్మం వద్దే కూర్చొన్నాడు. సరిగ్గా ఆసమయంలో ఆమె తన ప్రియుడుతో కలిసి బైక్‌పై రాగా భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
 
అహ్మదాబాద్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దసరా నవరాత్రుల సందర్భంగా గర్బా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అంటే అర్థరాత్రి 12 గంటలకు ఇంట్లో కుమార్తెను వదిలివేసి, తన ప్రియునితో ఒక మహిళ వెళ్లిపోయింది. 
 
ఉదయం 5 గంటల వరకూ ఆమె ఇంటికి రాకపోవడంతో భర్త ఎదురుచూస్తూ గుమ్మంవద్దే కూర్చున్నాడు. ఇంతలో ఆమె తన ప్రియునితో పాటు బైక్‌పై ఇంటికి వస్తుండటాన్ని భర్త గమనించాడు. వెంటనే వెళ్లి అతనిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను బండిపై అత్యంత వేగంగా వెళ్లిపోయాడు. 
 
అప్పటికీ వదిలిపెట్టకుండా బైక్‌పై అతనిని 4 కిలోమీటర్ల దూరం వెంబడించి, ఒక హోటల్ సమీపంలో అతడ్ని పట్టుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.